News December 16, 2024

శ్రీతేజ్ కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి: మందకృష్ణ

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధితులకు అల్లు అర్జున్ రూ.కోటి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, బాధ్యులెవరైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉందని, రెండు వారాలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.

Similar News

News November 24, 2025

సంగారెడ్డి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పారు. జిల్లాలోని 15,926 మహిళా సంఘాలకు 16.78 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 24, 2025

యూకేని వీడనున్న మిట్టల్!

image

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్‌లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.

News November 24, 2025

బీసీలకు రాహుల్ గాంధీ అన్యాయం: కేటీఆర్

image

తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని KTR అన్నారు. ‘ఆయన వెంటనే BC రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి. BJP సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ బీసీల విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టారు’ అని కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.