News May 8, 2024

ఏపీకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: జగన్

image

APలోనే అతిపెద్ద నగరం విశాఖ అని.. ఇప్పటికే అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఏపీకి విశాఖ ఐకాన్ సిటీ. అమరావతిలో అభివృద్ధికి ఎకరానికి రూ.2కోట్లు అవసరం. HYD, బెంగళూరు, చెన్నై స్థాయికి విశాఖ ఎదగాలి. మా హయాంలో APకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. MSMEలో 20 లక్షల మందికి ఉపాధి దక్కింది’ అని వెల్లడించారు.

Similar News

News February 4, 2026

ఒక్క AI టూల్.. ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరి!

image

భారతీయ IT రంగానికి నేడు బ్లాక్ వెడ్నెస్ డే అనే చెప్పాలి. AIతో సాఫ్ట్‌వేర్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన తీవ్రమవడంతో ఇన్వెస్టర్లు IT షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో ఈ ఒక్కరోజే ఈ రంగంలో ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 2020 మార్చి తర్వాత ఇదే అతిపెద్ద పతనం. TCS, ఇన్ఫీ సహా అన్ని దేశీయ IT కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. అమెరికా AI సంస్థ ఆంత్రోపిక్ తెచ్చిన కొత్త ఆటోమేషన్ టూల్ ఈ పతనానికి దారితీసింది.

News February 4, 2026

ఆధార్ దుర్వినియోగం.. క్షణాల్లో తెలుసుకోవచ్చు!

image

ఆధార్ భద్రత కోసం UIDAI ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఆధార్‌ను గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అందుకోసం UIDAI సైట్‌లోని ‘My Aadhaar’ విభాగానికి వెళ్లి ‘అథెంటికేషన్ హిస్టరీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్ నంబర్, OTPతో లాగిన్ అయితే వివరాలు కనిపిస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచడానికి ఇది ఉత్తమ మార్గం.

News February 4, 2026

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) పంచకులలో 7ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech/BSc(engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేల చొప్పున పెంచుతారు. వెబ్‌సైట్: https://bel-india.in