News December 4, 2024

అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

image

AP: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు/ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత X వేదికగా వెల్లడించారు.

Similar News

News February 25, 2026

శర్వానంద్ మాస్ లుక్

image

శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోగి’ నుంచి ఆయన లుక్ విడుదలైంది. అందులో శర్వా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చేతిలో ఆయుధంతో దర్శనమిచ్చారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కాబోతోంది.

News February 25, 2026

ఘోరం.. ఏడుస్తున్నాడని బిడ్డను నిప్పుల్లో వేసిన తల్లి

image

TG: బిడ్డ ఏడిస్తే ఓర్పుగా లాలించాల్సిన తల్లే సహనం కోల్పోయి దారుణానికి పాల్పడింది. 2 రోజులుగా బిడ్డ ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల పసికందు నోట్లో గుడ్డలు కుక్కేసి, కాళ్లు, చేతులు కట్టేసి నిప్పుల్లో పడేసింది. దీంతో ఆ బిడ్డ సజీవ దహనమయ్యాడు. ఈ అమానవీయ ఘటన మేడ్చల్(D) దుండిగల్‌లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లి మమత మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. MPకి చెందిన ఈమె భర్తతో కలిసి వలస వచ్చింది.

News February 25, 2026

మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

image

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.