News August 29, 2024

కార్మికులకు త్వరలో రూ.10లక్షల బీమా: సీఎం

image

AP: కార్మికులకు రూ.10లక్షల బీమా అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, బీమా పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని అన్నారు. పరిశ్రమల భద్రత అంశంలో రాజీపడొద్దని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 5, 2025

ట్రంప్ పార్టీ ఓటమి

image

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.

News November 5, 2025

సంతానలేమిని నివారించే ఖర్జూరం

image

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.

News November 5, 2025

SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఫలితాలు రిలీజ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 552 గ్రూప్-B కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసింది. ఆగస్టు 12న పేపర్ 1 పరీక్షను నిర్వహించగా.. పేపర్ 2 పరీక్షకు 3,642మంది క్వాలిఫై అయ్యారు. కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టింది. పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. వెబ్‌సైట్: https://ssc.nic.in/