News June 17, 2024
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: అశ్వినీ

పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు మెరుగైన ఎక్స్గ్రేషియాను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి రూ.2.5 లక్షలు, గాయాలైనవారికి రూ. 50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000ను PMNRF నుంచి ఇస్తామని ప్రకటించారు.
Similar News
News December 1, 2025
MDK: 15 హామీలతో అభ్యర్థి బాండ్ పేపర్

హవేలి ఘనపూర్ మండలం రాజుపేట్ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక 15 హామీలతో బాండ్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. 6 నెలలలోపు కొత్త ట్రాలీ కొని చెత్తసేకరణ, వృద్దులకు ఇంటివద్దకే పింఛన్ పంపిణీ, రోజు మంచినీటి సరఫరా, కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రూ.లక్ష లోన్ మంజూరు,
గిరిజనుల తీజ్ పండుగకు ఏడాదికి రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు ఇలా హామీలను బాండ్పై రాసి ప్రచారం చేస్తున్నారు.
News December 1, 2025
ఫలించిన చర్చలు… పత్తి కొనుగోళ్లు ఆరంభం

TG: పత్తి కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు, CCIతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు ఫలించాయి. నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో కొత్త నిబంధనలతో కొనుగోళ్లకు అనుమతులు లభించక మిల్లర్లు సమ్మెకు దిగారు. ప్రస్తుతం సమస్య పరిష్కారమవ్వడంతో సమ్మె విరమించారు. దీంతో రాష్ట్రంలోని 330 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు ₹2,904 కోట్ల విలువైన 3.66 లక్షల టన్నుల పత్తిని CCI సేకరించింది.
News December 1, 2025
మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.


