News May 31, 2024
రూ.10 నోట్లు దొరకట్లేదు!

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల రూ.10 నోట్ల కొరత ఏర్పడుతోంది. మార్కెట్లో రూ.10 నోటు చలామణి తగ్గిందని, ఎక్కువగా చిరిగిన నోట్లే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొరత వాస్తవమేనని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇండెంట్ పెడితే RBI నుంచి రూ.20, రూ.50, రూ.100 నోట్లే వస్తున్నాయని, రూ.10నోట్లు రావడం లేదంటున్నారు. అయితే రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయన్నారు. మరి మీకూ ఈ సమస్య ఉందా? కామెంట్ చేయండి.
Similar News
News February 20, 2026
అబద్ధాలు ట్రెండ్ కావచ్చు.. కానీ గెలిచేది నిజమే: లోకేశ్

AP: <<19166821>>హెరిటేజ్ ఫుడ్స్<<>> విషయంలో నిజం గెలిచిందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘హెరిటేజ్ సంస్థపై సాక్షి మీడియా చేసింది తప్పుడు ప్రచారమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. అబద్ధాలు ఒక రోజు ట్రెండ్ కావచ్చు. కానీ న్యాయ పరీక్షలో నిజమే గెలుస్తుంది. సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు.
News February 20, 2026
ఉచిత పథకాలు ఉండాలా.. మీరేమంటారు?

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి <<19183229>>ఆటంకం<<>> కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. SC వ్యాఖ్యలతో పలువురు ఏకీభవిస్తున్నారు. విద్య, వైద్యం వంటివి ఫ్రీగా అందేలా చూడాలని, బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, నగదు బదిలీతో నష్టమని అంటున్నారు. ఉపాధి కల్పించాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, మందులు తక్కువ ధరకు ఇవ్వాలని కోరుతున్నారు. పేదలకు ఉచిత పథకాలు ఉండాలని మరికొందరు వాదిస్తున్నారు. మీరేమంటారు?
News February 20, 2026
సంతోషీమాత వ్రతంలో పులుపు ఎందుకు నిషిద్ధం

సంతోషీ అమ్మవారు శాంతికి ప్రతీక. అయితే పులుపు, చేదు కోపాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచడానికి వ్రతం రోజున వీటిని దూరం పెడతారు. వీటిని నివారిస్తే భక్తులలో పట్టుదల, నిగ్రహం పెరుగుతాయి. సహనం అలవాటు అవుతుంది. అత్యాశ తగ్గి ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందే గుణం అలవరుతుంది. అలాగే ఆలోచనలలో స్వచ్ఛత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా సాత్విక ప్రభావాన్ని చూపుతుంది.


