News May 18, 2024
ప్రధానిని అవమానించమని రూ.100కోట్లు ఆఫర్: BJP నేత

ప్రధాని మోదీని అవమానించేలా మాట్లాడితే రూ.100కోట్లు ఇస్తామని కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ ఆఫర్ చేశారని BJP నేత జి.దేవరాజే గౌడ ఆరోపించారు. ఆ డీల్‌కు ఒప్పుకోనందుకే తనపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారన్నారు. మోదీతో పాటు కర్ణాటక మాజీ CM కుమారస్వామిని కూడా కించపరిచేలా మాట్లాడాలని తనపై ఒత్తిడి చేసి, రూ.5కోట్లు అడ్వాన్స్ పంపించారని గౌడ తెలిపారు. కాగా ఆయన ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Similar News
News November 22, 2025
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ సత్యసాయి(D) పుట్టపర్తికి వెళ్లనున్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉ.11 గంటలకు ముర్ము అక్కడికి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టులో CM చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. మ.3.40గంటలకు రాధాకృష్ణన్ చేరుకుంటారు. సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి రాధాకృష్ణన్, చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.