News October 3, 2024

అంబానీ ఇంటికి రూ.వెయ్యి కోట్ల విమానం

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దాదాపు రూ.వెయ్యికోట్లు ఖర్చు చేసి కొన్న బోయింగ్ 737 MAX 9 ఇండియాకు వచ్చింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన విమానమని తెలుస్తోంది. ఆయన దగ్గర ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. ఇటీవల ఆయన కొన్న ఈ బోయింగ్ ఫ్లైట్ విదేశాల్లో టెస్టు తర్వాత తాజాగా ఇండియాకు చేరుకుంది. ఈ విమానం 838kmph వేగంతో నాన్ స్టాప్‌గా 11,770kmలు ప్రయాణిస్తుంది.

Similar News

News October 9, 2024

FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్

image

ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.

News October 9, 2024

నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

image

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన టీచర్లకు దసరా సెలవులు ముగిసే లోపే పోస్టింగులు ఇచ్చేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

News October 9, 2024

స్థానిక సంస్థలకు రూ.287 కోట్లు విడుదల

image

AP: గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.287.12 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ జీవో ఇచ్చారు. ఇటు PM జన్‌మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.29.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.