News July 23, 2024
వారికి రూ.1,00,000.. అప్లై చేసుకోండి!
TG: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం తాజాగా సైట్ ప్రారంభించింది. ఫొటో, సంతకం, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు, మెయిన్స్ అప్లికేషన్ ఫామ్, బ్యాంక్ వివరాలు, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. చివరి తేదీ: ఆగస్టు 6. సైట్ కోసం ఇక్కడ <
Similar News
News January 25, 2025
తిరుమలలో ఫిబ్రవరి 4న VIP బ్రేక్ దర్శనాలు రద్దు
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. 9కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 57,655 మంది దర్శించుకోగా 20,051 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.73కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే 3-5 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపేశారు.
News January 25, 2025
ఐదు రోజుల అనంతరం ముగిసిన ఐటీ రైడ్స్
హైదరాబాద్లోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇవాళ తెల్లవారుజాము వరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గత 5 రోజుల నుంచి SVC ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు.
News January 25, 2025
‘మా కూతురిలా ఏ అమ్మాయి మోసపోవద్దు’
TG: తన భర్త బాజీ దొంగ అని తెలియడం, పోలీసులు ఇంటికొచ్చి అతడిని తీసుకెళ్లడంతో అవమానంతో కూతుళ్లను చంపి, ఆత్మహత్య చేసుకున్న మౌనిక తల్లిదండ్రుల ఆవేదన ఇది. కడసారి కూతురిని చూసేందుకు వారు HYD నుంచి ఖమ్మం వెళ్లారు. బాజీ మాయమాటలు చెప్పి తమ కూతురిని వలలో వేసుకున్నాడని, పెళ్లి వద్దని చెప్పినా వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా ఎంటెక్ చదివిన మౌనిక ఆరేళ్ల కింద రైలులో పరిచయమైన బాజీని మతాంతర వివాహం చేసుకుంది.