News May 3, 2024
మహిళలకు ఏడాదికి రూ.1,00,000: కాంగ్రెస్

TG: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించింది.
* మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.1,00,000
* విద్యావంతులైన యువకులకు నెలకు రూ.8500 ఉపకార వేతనంతో ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్
* ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం రోజుకి రూ.400
* సామాజిక, ఆర్థిక అంశాలతో కూడిన కులగణన
* పంట నష్టపోయిన రైతులకు బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం
Similar News
News March 17, 2026
ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.


