News May 3, 2024

రూ. 11.67 లక్షల చెవిదిద్దులు.. రూ. 1167కే సొంతం!

image

రూ.11.67 లక్షల విలువైన వజ్రాల చెవిదిద్దులవి. కార్టియర్ వెబ్‌సైట్లో గ్లిచ్ కారణంగా మెక్సికోకు చెందిన రోజిలియో అనే వ్యక్తికి రూ. 1167కే దక్కాయి. ధర తక్కువ కదా అని 2 జతలు ఆర్డర్ పెట్టాడు. విషయం అర్థమైన సదరు సంస్థ వెబ్‌సైట్‌లో రేటు మార్చింది. వాటిని అమ్మేందుకు నిరాకరించింది. దీంతో వినియోగదారుల కోర్టుకు వెళ్లి మరీ రోజిలియో వాటిని దక్కించుకున్నాడు. చిన్న తప్పునకు సంస్థ పెద్ద మూల్యం చెల్లించక తప్పలేదు.

Similar News

News March 27, 2026

సీతారాములను దర్శించుకున్న జడ్జి దామోదరరావు

image

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్ సమీపంలోని సీతారామస్వామి ఆలయంలో రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు సీతారాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, అర్చకులు ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి దుశ్శాలువ కప్పి సత్కరించారు. అనంతరం ప్రత్యేక దర్శనం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

News March 27, 2026

‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

image

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.

News March 27, 2026

ఈ క్వాలిటీస్ ఉన్న మహిళలను పురుషులు ఇష్టపడతారు!

image

మహిళల్లోని కొన్ని క్వాలిటీలు పురుషులను ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు. ‘ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిని ఇష్టపడతారు. ఇండిపెండెంట్‌‌గా, దయతో ఉండే వారు నచ్చుతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పగల, తమ తప్పును ఒప్పుకోగల వారికి అట్రాక్ట్ అవుతారు. తమకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని, తాము కలగన్న వాటిని సాధించుకోవాలనుకునే వారిని పురుషులు లైక్ చేస్తారు’ అని చెబుతున్నారు.