News March 9, 2025
ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్‌లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.
Similar News
News March 9, 2025
సెలవు ఇవ్వలేదు.. సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చిన టీచర్

ఒడిశాలో ఒక ఉపాధ్యాయుడు సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చారు. ప్రకాశ్ భోయ్ అనే వ్యక్తి ఈనెల 6న తన తాత మరణించడంతో అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. సెలవు కావాలని కోరగా ప్రిన్సిపల్ నిరాకరించారు. దీంతో ప్రకాశ్ సెలైన్ బాటిల్‌తోనే విధులకు హాజరయ్యారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి పేర్కొన్నారు.
News March 9, 2025
గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ వేడ్

IPL: గుజరాత్ టైటాన్స్ జట్టు తమ మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ‘ఛాంపియన్, పోరాట యోధుడు. ఇప్పుడు మా అసిస్టెంట్ కోచ్. మన డగౌట్‌కి తిరిగి స్వాగతం వేడ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, ఆశిష్ కపూర్, నరేందర్ నేగి సహాయక కోచ్‌లుగా, పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు.
News March 9, 2025
AIIMSలో ధన్‌ఖడ్.. ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో PM మోదీ AIIMSకు చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఉప రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఆపై ట్వీట్ చేశారు. 73ఏళ్ల ధన్‌ఖడ్ కార్డియాక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.