News March 16, 2025
రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం

AP: CM చంద్రబాబు సమక్షంలో హడ్కో- CRDA మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11వేల కోట్ల రుణం ఇవ్వనుంది. జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించగా, నేడు ఆ మేరకు ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. వచ్చే నెల ప్రధాని చేేతుల మీదుగా రాజధాని పనులు పున: ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 21, 2026
అన్నమయ్య జిల్లాకు నూతన JC.!

అన్నమయ్య జిల్లా మదనపల్లి నూతన సంయుక్త కలెక్టర్గా శివ నారాయణశర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా నూతన సంయుక్త కలెక్టర్ కలెక్టర్ నిశాంత్ కుమార్ను గౌరవపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్తో పలు విషయాలు చర్చించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రాలతో ఛాంబర్లోకి ఆహ్వానం పలకగా JC బాధ్యతలు స్వీకరించారు.
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 1/2

TGలో నైనీ కోల్ బ్లాక్ వివాదం పెనుదుమారం రేపుతోంది. ఒడిశాలోని నైనీలో ఉన్న బొగ్గు గనిని గతంలో కేంద్రం సింగరేణికి కేటాయించింది. తవ్వకాలకు సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఈ నెల 29 వరకు గడువు విధించింది. అయితే నోటిఫికేషన్లో 1.8 నిబంధన ప్రకారం గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు GM నుంచి తీసుకున్న ధ్రువపత్రాన్ని జత చేయాలని తెలిపింది. ఇక్కడే అసలైన వివాదం మొదలైంది.
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 2/2

TG: సింగరేణి నిబంధన ప్రకారం తాము నైనీ కోల్ బ్లాక్ను సందర్శించినా GM సర్టిఫికెట్ ఇవ్వలేదని, దీంతో టెండర్లలో పాల్గొనలేకపోతున్నామని కొన్ని కంపెనీలు ఆరోపించాయి. పలువురు మంత్రులు తమ వారికే టెండర్ ఇప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలూ గుప్పుమన్నాయి. దీంతో వివాదం ముదరడంతో Dy.CM భట్టి టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇంతలో గొడవలోకి ఎంటరైన కేంద్రం ఇలా అయితే సింగరేణిని తామే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.


