News September 3, 2025
విద్యార్థులకు రూ.12,000.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

AP: పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం NMMS పేరుతో నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుంది. పూర్తి వివరాలకు <
Similar News
News September 3, 2025
PHOTOS: ఉత్తరాదిలో వర్ష బీభత్సం

కుండపోత వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంజాబ్, చండీగఢ్, హిమాచల్‌లో ఈనెల 7 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్‌తో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
News September 3, 2025
యంగ్ ఏజ్‌లోనే ఓల్డ్ లుక్ కనిపిస్తోందా?

కొందరికి చిన్న వయసులోనే ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. పోషకాహారం తీసుకుంటే నవ యవ్వనంతో మెరిసిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘టమాటాలు తీసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది. బ్లూ చెర్రీ, గ్రీన్ టీతో కొత్త చర్మకణాలు ఉత్పత్తి అవుతాయి. పెరుగు తింటే చర్మం ఎర్రగా మారదు. బాదం, పిస్తా వంటివి తింటే చర్మ సమస్యలు తగ్గుతాయి. నీళ్లు ఎక్కువగా తాగితే యవ్వనంగా కనిపిస్తారు’ అని అంటున్నారు.
News September 3, 2025
రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చాలి: అశోక్

AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్‌ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.