News December 24, 2024

అకౌంట్లలోకి రూ.12,000.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా ₹12K అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈమేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు వెల్లడించకపోవడంపై పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో ₹6K చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News November 27, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (<>TSLPRB<<>>) 60 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://www.tgprb.in

News November 27, 2025

చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

image

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.

News November 27, 2025

పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

image

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.