News January 11, 2025
వారికే ఏడాదికి రూ.12,000: సీఎం
TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అర్హుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూమి లేని, ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు ఫైనల్ చేయాలని ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12వేలు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈనెల 26న స్కీమ్ను ప్రారంభించనున్నారు.
Similar News
News January 11, 2025
నేను హిందీ నేర్చుకుంది అలానే: మోదీ
జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందీ సరిగ్గా రాదని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని నిఖిల్ కామత్ అనగా, మోదీ తన మాతృభాష కూడా హిందీ కాదని అన్నారు. తన బాల్యంలో రైల్వే స్టేషన్లో చాయ్ చుట్టూ హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారని.. వారితో మాట్లాడుతూ భాష నేర్చుకున్నానని మోదీ వ్యాఖ్యానించారు.
News January 11, 2025
తొలిరోజు కలెక్షన్లు రూ.186 కోట్లు: ‘గేమ్ ఛేంజర్’ టీమ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.186 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్బస్టర్ అంటూ పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు వచ్చాయి.
News January 11, 2025
పంట వేయకున్నా రైతుభరోసా? మీ కామెంట్!
TG: రైతు పంట వేసినా, <<15120633>>వేయకపోయినా<<>> వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ నిన్న చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం పంట వేయకుండా ఖాళీగా ఉన్న వందల ఎకరాలకు సైతం డబ్బులు అందుతాయని పలువురు చెబుతున్నారు. పెట్టుబడి సాయం పంట వేసిన వారికి మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అసలైన రైతులకే సాయం అందుతుందంటున్నారు. దీనిపై మీ కామెంట్?