News October 2, 2024
పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు: CM చంద్రబాబు

AP: అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 19, 2026
శ్రీలంకకు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

T20 WC సూపర్-8కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్ మతీశ పతిరణ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడారు. అతడు కోలుకోవడానికి 4-5 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు IPLలోనూ పతిరణ ఆడటం డౌటేనని తెలుస్తోంది. అతడిని KKR ₹18 కోట్లకు <<18581979>>కొనుగోలు<<>> చేసింది.
News February 19, 2026
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News February 19, 2026
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.


