News August 8, 2025

ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. స్మృతి ఇరానీ ఏమన్నారంటే?

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీజన్-2’లో ఆమె నటిస్తున్నారు. ఇందులో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి స్పందిస్తూ టెలివిజన్ ఇండస్ట్రీలో తానే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Similar News

News August 8, 2025

YS భాస్కర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డికి నోటీసులు

image

AP: TDP నేత విశ్వనాథరెడ్డిని బెదిరించిన కేసులో YS భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చారు. కడప పోలీసులు HYD వెళ్లి 41A నోటీసులు అందజేశారు. విశ్వనాథరెడ్డి ఇటీవలే బీటెక్ రవి సమక్షంలో TDPలో చేరారు. ఈ నేపథ్యంలో తనను భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, MP అవినాశ్ PA, తదితరులు బెదిరించారని కాల్ డేటా సమర్పించారు. దాంతో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ వివేకా హత్యకేసులోనూ నిందితులు.

News August 8, 2025

గిఫ్టులు, డబ్బులు రెడీనా బ్రదర్స్!

image

రేపే రాఖీ పండుగ. తెలుగు రాష్ట్రాల్లోని రాఖీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అక్కాచెల్లెళ్లను సంతోషపరిచేందుకు సోదరులు గిఫ్టు షాపులు, ఏటీఎంల చుట్టూ తిరిగేస్తున్నారు. చెల్లెమ్మలు తమ కావాల్సినవి ఇండైరెక్ట్‌గా తెలిపేందుకు అన్నలకు ఇన్‌స్టా రీల్స్‌ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు సొంతూళ్లకు బయల్దేరారు.

News August 8, 2025

మర్డర్ కేసులో కోటా వినుతకు బెయిల్

image

AP: డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత కోటా వినుతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ చెన్నైలోని C3 సెవెన్ వెల్స్ పీఎస్‌లో సంతకం చేయాలనే షరతుతో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా తన కారు డ్రైవర్‌ను కోటా వినుత భర్త చంద్రబాబుతో కలిసి చంపారనే ఆరోపణలతో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మద్రాస్ జైలుకు తరలించారు.