News August 21, 2025
వారికి రూ.15 లక్షల సాయం

ఉద్యోగి చనిపోతే కుటుంబానికి ఇచ్చే డెత్ రిలీఫ్ ఫండ్‌ను EPFO భారీగా పెంచింది. గతంలో గరిష్ఠంగా ₹8.8 లక్షలుగా ఉన్న ఈ సాయాన్ని తాజాగా ₹15 లక్షలకు చేర్చింది. 2025 APR 1 తర్వాత ఎవరైనా ఉద్యోగి చనిపోతే అతని కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది. 2026 APR 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా ఏటా 5% పెరుగుతుందని EPFO వెల్లడించింది. అటు మైనర్లకు అందాల్సిన డబ్బును గార్డియన్ షిప్ సర్టిఫికెట్ లేకుండానే ఇకపై ఇవ్వనున్నారు.
Similar News
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
అలా అయితేనే యుద్ధం ముగుస్తుంది: ఇరాన్ అధ్యక్షుడు

రష్యా, పాక్ లీడర్లతో యుద్ధ పరిస్థితులపై చర్చించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు US, ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. ‘అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి’ అని Xలో పోస్ట్ చేశారు.
News March 12, 2026
ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


