News September 19, 2025
ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.
Similar News
News February 5, 2026
టెన్త్ స్టూడెంట్లకు సీజనల్ హాస్టళ్లు

AP: స్కూళ్లకు సరిగ్గా రాని టెన్త్ విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో 50 వసతి గృహాలను సోమవారం ప్రారంభించనుంది. స్థానిక టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను హాస్టళ్లకు తీసుకొస్తారు. అక్కడే వసతి, భోజనం సౌకర్యంతోపాటు ఉపాధ్యాయులతో తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తారు.
News February 5, 2026
గ్రూప్-1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నియామకాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది. పరీక్షల నిర్వహణ, కరెక్షన్ వంటి నిబంధనల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పలువురు గతంలో HCని ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా ఇవాళ తీర్పుతో 562 పోస్టుల భవితవ్యం తేలనుంది.
News February 5, 2026
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.


