News February 11, 2025
మద్యం ధరల పెంపుతో రూ.150 కోట్ల ఆదాయం: కొల్లు

AP: YCP హయాంలో నకిలీ బ్రాండ్లతో మద్యం విక్రయాలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం డిపోలను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల్లో ₹12K కోట్లు తాము చెల్లించామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా లిక్కర్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. బాటిల్పై రేటు ₹10 పెంచామని, దీనివల్ల ప్రభుత్వానికి ₹150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామన్నారు.
Similar News
News January 22, 2026
CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<
News January 22, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100 పతనమై రూ.1,41,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 22, 2026
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

యూరప్ దేశాలపై టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.


