News November 10, 2024
అమరావతికి రూ.15,000కోట్ల రుణం.. నిధుల వినియోగంపై ఉత్తర్వులు

AP: అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.
Similar News
News January 21, 2026
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ ఉక్కుపాదం: 101 మందికి శిక్షలు!

ప్రమాద రహిత కామారెడ్డి జిల్లాగా మార్చేందుకు ప్రతి రోజూ తనిఖీలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. గత రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 101 మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 31 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. మొత్తం రూ. 1,01,000 జరిమానాగా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు.
News January 21, 2026
T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.
News January 21, 2026
రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్లు

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.


