News November 11, 2024

అమరావతికి రూ.15K కోట్ల రుణం.. నేడు సంతకాలు

image

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అందించే రూ.15,000 కోట్ల <<14576900>>రుణంపై<<>> నేడు కీలక ముందడుగు పడనుంది. రుణ ఒప్పందాలపై ఢిల్లీలో సీఆర్డీఏ, బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ నిధులతో అమరావతిలో ప్రధాన రహదారులు, స్మార్ట్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, లిఫ్ట్ స్కీమ్‌లు, తాగునీటి సరఫరా, హైకోర్టు, సచివాలయం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల భవనాలను నిర్మిస్తారు.

Similar News

News January 2, 2026

నిజామాబాద్: ఏటీఎం దొంగల ముఠా కోసం వేట

image

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ముఠాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌లో ఇటీవల రెండు ఏటీఎంలు గ్యాస్ కట్టర్‌తో కాల్చి రూ.36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అది జరిగిన రెండో రోజు మళ్లీ నిజామాబాద్, జక్రాన్‌పల్లిలలో రెండు ఏటీఎంల లూటీకి విఫలయత్నం చేశారు. సీరియస్‌గా తీసుకున్న సీపీ సాయి చైతన్య ఐదు బృందాలతో మహారాష్ట్ర, హర్యానాలో నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.

News January 2, 2026

రేవంత్‌రెడ్డిని రెండు సార్లు ఉరితీయాలి: కవిత

image

TG: MLC కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. KCRను ఉరితీయాలని రేవంత్ అనడం సరికాదని, ఉద్యమకారుడిని అలా అంటే రక్తం మరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు, రెండు సార్లు ఉరితీయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తిన కవిత, BRS మనుగడ కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. తన రాజీనామా ఆమోదం కోసం మండలికి వచ్చిన ఆమె ఈ విధంగా కామెంట్స్ చేశారు.

News January 2, 2026

నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగు – నివారణ

image

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.