News August 10, 2025
త్వరలోనే మహిళలకు రూ.18వేలు: ఎంపీ కేశినేని చిన్ని

AP: కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కొక్కటిగా విజయవంతంగా అమలు చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుందని చెప్పారు. ఆ తర్వాత త్వరలోనే ‘స్త్రీ నిధి’ పథకం కింద మహిళలకు నెలకు రూ.1,500(ఏటా రూ.18,000) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.
Similar News
News August 10, 2025
ఆగస్టు 10: చరిత్రలో ఈరోజు

1894: మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి(ఫొటోలో) జననం
1914: ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ రచయిత శంకరంబాడి సుందరాచారి జననం
1945: అమెరికా దేశ రాకెట్ల పితామహుడు రాబర్ట్ గొడ్డార్డ్ మరణం
● నేడు ప్రపంచ జీవ ఇంధన(బయో ఫ్యూయల్) దినోత్సవం
● ప్రపంచ సింహాల దినోత్సవం
News August 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 10, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.