News November 27, 2024

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.196 కోట్లు రిలీజ్

image

TG: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతుల కొరత ఉంది. ఈ విషయమై స్థానిక నాయకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా మౌళిక వసతులు పూర్తి చేయాల్సిన ఇళ్లు ఇంకా 40 వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 3, 2026

బినామీ ఆస్తుల గుర్తింపునకు AI టూల్: అతుల్ సింగ్

image

AP: అవినీతి కేసుల్లో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. 2025లో ACB 115 కేసులు నమోదు చేసింది. ఇందులోని 69 ట్రాప్ కేసుల్లో 19 రెవెన్యూ విభాగానివే. కాగా ఆదాయానికి మించిన కేసులు 8 ఉన్నాయి. విద్యుత్తు, వైద్య, మున్సిపల్, PR శాఖల ఉద్యోగులపై ఈ కేసులున్నాయి. ఉన్నత, మధ్యస్థాయి అధికారులు బినామీల పేరిట ఆస్తుల్ని కూడబెడుతున్నారు. వాటిని గుర్తించడానికి AI టూల్‌ను ప్రవేశపెడుతున్నామని ACB DG అతుల్ సింగ్ తెలిపారు.

News January 3, 2026

ఇతిహాసాలు క్విజ్ – 116 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
సమాధానం: వాల్మీకీ కన్నా ముందు రామాయణాన్ని హనుమంతుడు రాశారని పురాణ గాథలు చెబుతున్నాయి. అది వాల్మీకి రచన కన్నా అద్భుతంగా ఉందని, తన రచనని ఎవరూ చదవరని వాల్మీకీ ఆందోళన చెందాడట. మహర్షి మనస్తాపాన్ని గమనించిన హనుమ, ఏమాత్రం ఆలోచించకుండా తను రాసిన రామాయణాన్ని రచనను చించివేశాడని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 3, 2026

కీలక అంశంపై చర్చ.. ఎవరికి వారే యమునా తీరే!

image

TG: నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కీలక చర్చ పెట్టింది. కానీ దీనికి ఒకరోజు ముందే BRS సమావేశాలను బహిష్కరించింది. ఇవాళ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే అధికార కాంగ్రెస్ MLAలే సభలో కూర్చోకుండా లాబీల్లో చక్కర్లు కొట్టారు. దీనిపై స్వయంగా CM రేవంత్ సీరియస్ అయ్యారు. అటు చర్చ సందర్భంగా పలువురు BJP ఎమ్మెల్యేలు సభలో నిద్రపోయారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.