News July 16, 2024
రూ.2 లక్షల రుణమాఫీ.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి వర్తిస్తుందా?

TG: బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా మాఫీ చేస్తామన్నారు. ‘MLAలు, IAS, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదు. వ్యవసాయం చేసే గ్రూప్-4 ఉద్యోగులకూ మాఫీ చేస్తాం. 11.50 లక్షల మందికి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయి. వీరి కోసం ఎల్లుండి రూ.6వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News January 4, 2026
రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: ఎస్వీ

రాయలసీమలో ఎత్తిపోతల పథకాలను చంద్రబాబుతో కలిసి నిలిపేశామని అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటులో కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై సీమ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పాలన్నారు.
News January 4, 2026
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. పదేళ్లలో ఫిఫా అండర్-17, హాకీ ప్రపంచ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ.. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు, ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యమని 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.


