News January 31, 2025
అకౌంట్లలోకి రూ.2 వేలు.. నేడే లాస్ట్

వచ్చే నెలలో పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పథకానికి రిజిస్టర్ కాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి, లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయడానికి ఇవాళే చివరి తేది. pmkisan.gov.in సైట్లో సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు upfr.agristack.gov సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News December 6, 2025
‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.
News December 6, 2025
ఇంటింటికీ ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్.. బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు స్థాయికి మించిన హామీలు ఇస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలపై బాండ్లు రాసిచ్చేవారు అరుదు. ములుగు(D) ఏటూరునాగారంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఇంటింటికీ వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని బాండ్ రాసిచ్చారు. కోతుల బెడద, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
News December 6, 2025
సరిహద్దులపై ‘డ్రాగన్’ పడగ.. 16 స్థావరాల నిర్మాణం!

భారత సరిహద్దుల్లో చైనా కుతంత్రాలు ఆగడం లేదు. టిబెట్లో సైనిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తోందని, 16 ఎయిర్ఫీల్డ్లు, హెలిపోర్ట్లను నిర్మించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈ మేరకు 100కు పైగా శాటిలైట్ ఇమేజెస్ను విశ్లేషించింది. ఆ స్థావరాలు చాలావరకు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయని చెప్పింది. 14,850 అడుగుల పొడవైన రన్ వేలు, 70 కన్నా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.


