News August 21, 2025

ఆన్‌లైన్ గేమ్స్‌తో రూ.20 వేల కోట్లు గుల్ల!

image

మన దేశంలో ఏటా ప్రజలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.20,000 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఫేక్ లొకేషన్లతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నవారు అడ్డదారులు తొక్కుతున్నారు. దోపిడీ, దొంగతనాలతోపాటు సిగరెట్లు, మద్యం, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారు.

Similar News

News March 4, 2026

ఇరాన్ మరో 10 రోజులు యుద్ధం చేస్తే USకు దెబ్బే!

image

యుద్ధంలో ఖమేనీని తొలిరోజే అంతం చేసిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోకుండా దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ యుద్ధం 4 వారాల్లో పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నా అది మరింత కాలం సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 10 రోజులు దాడులు కొనసాగితే అమెరికా Tomahawk మిస్సైళ్లతో పాటు SM-3 interceptors లాంటి కీలక ఆయుధాల స్టాక్స్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు CNN పేర్కొంది.

News March 4, 2026

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 100 మంది గల్లంతు!

image

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్‌మెరైన్‌తో అటాక్ చేయడంతో IRIS Dena షిప్‌లోని 101 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 78 మంది గాయపడ్డారని సమాచారం. షిప్ నుంచి సాయం కోసం కాల్ వచ్చిందని, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ను పంపామని శ్రీలంక తెలిపింది. గాలే తీరంలో షిప్ మునిగిపోయిందని, తీవ్రంగా గాయపడిన 32 మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు లంక మంత్రి విజిత హెరాత్ తెలిపారు. దాడి ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.

News March 4, 2026

BRIC-THSTIలో ఉద్యోగాలు

image

<>BRIC-<<>>ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI) 3 అస్యురెన్స్ అసోసియేట్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PwBD, మహిళలకు రూ.118. వెబ్‌సైట్: https://thsti.res.in