News March 10, 2025

ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

image

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.

Similar News

News March 10, 2025

పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

image

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.

News March 10, 2025

50-30-20 రూల్‌ పాటిస్తున్నారా?

image

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్‌ మెయింటేన్ చేయండి. SHARE IT

News March 10, 2025

క్రోమ్‌ను గూగుల్ అమ్మేయాల్సిందే: DOJ

image

క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేయాలని గూగుల్‌కు DOJ మరోసారి స్పష్టం చేసింది. కోర్టు గత ఏడాది ఆదేశించినట్టుగా ఆన్‌లైన్ సెర్చ్‌లో అక్రమ గుత్తాధిపత్యానికి తెరదించాలని వెల్లడించింది. ఏ సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకోవాలన్న హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. యాపిల్, మొజిల్లా సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్ ఒప్పందాలు చట్టవిరుద్ధమని తెలిపింది. 2021లో వీరికి గూగుల్ $26.3B ఇచ్చినట్టు ఆధారాలు దొరికాయి.

error: Content is protected !!