News February 1, 2025

అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

image

AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.

Similar News

News December 10, 2025

MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.

News December 10, 2025

పిల్లాడి ఆత్మహత్యతో AUSలో SM అకౌంట్లు క్లోజ్!

image

ఆస్ట్రేలియాలో నేటి నుంచి <<18509557>>16<<>> ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించలేరు. అయితే దీని వెనుక 14 ఏళ్ల బాలుడు ఆలివర్ ఆత్మహత్య ప్రధాన కారణం. ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే డిసీస్‌తో ఆలివర్.. SM ప్రభావంతో బరువు తగ్గి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావం ఆందోళనకరంగా ఉందని ఆలివర్ తల్లి ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌కి లేఖ రాయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది.

News December 10, 2025

U19 హెడ్ కోచ్‌పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

image

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్‌పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్‌పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.