News December 5, 2024

త్వరలో రైతులకు రూ.20,000: మంత్రి

image

AP: వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరులో మిర్చి యార్డును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తాం. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 అందిస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయి. ఆలస్యం చేయకుండా రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.

Similar News

News April 3, 2026

మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

image

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.

News April 3, 2026

ప్రకృతి సేద్యం ‘అగ్ని అస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో కాండం, కాయ తొలిచే పురుగులు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆకుముడత, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు అగ్నాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు మూత్రం – 10 లీటర్లు ☛ పచ్చి పొగాకు – 1 కిలో ☛ పచ్చి వేపాకు 5 కిలోలు ☛ పచ్చి మిరపకాయలు 1 లేదా 2 కిలోలు ☛ వెల్లుల్లి పేస్టు – అర

News April 3, 2026

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.