News October 9, 2024

రూ.436 చెల్లిస్తే రూ.2,00,000 బీమా

image

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా కేంద్రం టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో రూ.436 ప్రీమియం చెల్లిస్తే ఏటా రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. సేవింగ్స్ అకౌంట్ కలిగి 18-50 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఈ స్కీంకు అర్హులు. www.jansuraksha.gov.in/లో ఫాం నింపి బ్యాంక్, పోస్టాఫీసులో అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించాక 55 ఏళ్ల వయసు వరకు జీవిత బీమా కొనసాగించొచ్చు.

Similar News

News January 23, 2026

నేడే సెకండ్ T20.. అక్షర్ పటేల్, బుమ్రా దూరం!

image

నేడు రాయ్‌పూర్ వేదికగా IND-NZ మధ్య రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇవాళ ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అతని స్థానంలో కుల్దీప్‌ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్‌లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్‌కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.

News January 23, 2026

వరిలో రాగి, బోరాన్ లోపాన్ని ఇలా గుర్తించండి

image

వరిలో రాగి సూక్ష్మపోషకం లోపిస్తే ఆకు చివర ఎండి, ఆకుపై ముతక ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వెన్నులోని గింజలు చిన్నవిగా ఉంటాయి. రాగి లోప నివారణకు ఆకులపై ఒక లీటరు నీటిలో 1 గ్రాము కాపర్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపిస్తే పంట లేత ఆకుల చివరలు మెలితిరిగి, వేర్లు వృద్ధి చెందవు. పంట ఎదుగుదల సరిగా ఉండదు. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ ద్రావణాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News January 23, 2026

వృత్తులు చేస్తున్నారా? ఇలా చేస్తే నైపుణ్యం మీవెంట..

image

సరస్వతీ దేవిని ‘సకల కళా స్వరూపిణి’ అంటారు. అందుకే ఈ రోజున సంగీతకారులు తమ వాయిద్యాలను (వీణ, తబలా, వయొలిన్), చిత్రకారులు తమ కుంచెలను, డ్యాన్సర్స్ తమ గజ్జెలను పూజించాలి. దీనివల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికివస్తుంది. అలాగే వృత్తి పని వారు తమ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం వల్ల ఆ వృత్తిలో నైపుణ్యం పెరిగి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఏ రంగంలో అయినా ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి ఈ దినం ఒక వరం.