News March 14, 2025
NEPని ఒప్పుకోనందుకు రూ.2,152 కోట్లు ఇవ్వలేదు: తమిళనాడు మంత్రి

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అంగీకరించనందుకు కేంద్రం తమిళనాడుకు రూ.2,152 కోట్లు విడుదల చేయలేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ‘మా రాష్ట్రంలో మూడు భాషల విధానాన్ని అంగీకరించనందుకు కేంద్రం ఆ నిధులను ఆపింది. అయినా ఫర్వాలేదు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమం, టీచర్ల జీతాలు, ఇతర ఖర్చుల కోసం మా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయిస్తాం’ అని బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు.
Similar News
News March 27, 2026
TODAY HEADLINES

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల
News March 27, 2026
TODAY HEADLINES

*పశ్చిమాసియా సంక్షోభం.. సీఎంలతో రేపు మోదీ మీటింగ్
*AP: మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి
*అమరావతికి చట్టబద్ధత కల్పించేలా క్యాబినెట్ తీర్మానం
*నియోజకవర్గాలు 50% పెరుగుతాయి: CBN
*TG: ఆరోగ్యశ్రీకి ప్రతి నెలా రూ.89 కోట్లు: రేవంత్
*మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి
*IPL రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల
News March 27, 2026
సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఫ్రీగా బిర్యానీ తినండి!

తమిళనాడు హోసూరులో ఓ హోటల్ ఓనర్ పెట్టిన వినూత్న ఆఫర్ ఇది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో యజమాని అశోక్ ఇలా ప్రకటించడంతో SMలో వైరల్ అయింది. ఫుల్ సిలిండర్ తీసుకొని, వెంటనే దానికైన డబ్బులు, ఖాళీ సిలిండర్ ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో గత 15 రోజుల్లో 6 సిలిండర్లు వచ్చినట్లు తెలిపాడు. కానీ సిలిండర్ ఇచ్చినవారిలో ఎవరూ 2-3 రోజులకు మించి ఫ్రీగా బిర్యానీ తినలేదట.


