News September 12, 2025
‘TG 09 G9999’కు రూ.25.50 లక్షలు

TG: సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్‌కు అధికంగా వెచ్చిస్తుంటారు. HYD సెంట్రల్ జోన్ RTA ఇవాళ నిర్వహించిన వేలంలో TG09G9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయ్యర్స్ పాల్గొనగా Hetero డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్‌ను దక్కించుకుంది. ఇతర నంబర్లు రూ.1.01-6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఒక్క రోజే రూ.63.7 లక్షల ఆదాయం వచ్చింది.
Similar News
News February 1, 2026
NRIలకు గుడ్‌న్యూస్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు బూస్ట్!

బడ్జెట్‌లో NRIs కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (PIS) పరిమితులను ప్రభుత్వం భారీగా పెంచింది. వ్యక్తిగత పెట్టుబడి లిమిట్‌ను 5% నుంచి 10%కి, అలాగే NRIల మొత్తం పెట్టుబడి పరిమితిని 10% నుంచి 24%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల భారతీయ కంపెనీల్లో NRIలు మరింత మెరుగైన వాటా పొందే అవకాశం ఉంటుంది.
News February 1, 2026
కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.
News February 1, 2026
పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు

AP: FY26-27 కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు ₹3320 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో ₹5936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించినా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ₹3017 కోట్లు మాత్రమే వచ్చాయి. పోలవరం వాటర్ స్టోరేజి లెవల్‌ను 41.15 మీటర్లకు కుదించినట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.


