News November 21, 2024
పంత్కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు? ఎందుకంటే?
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలుకుతారని రైనా, ఉతప్ప, చోప్రా వంటి మాజీలు జోస్యం చెబుతున్నారు. కాగా ఒకే ఒక ప్రయోజనం కోసమే పంత్కు భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. పంత్ ఓ గన్ ప్లేయర్, వికెట్ కీపర్ కూడా. ప్రస్తుతం ఆయన వయసు 27 ఏళ్లే. దీంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతడిని దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 24, 2024
పోలవరం, స్టీల్ప్లాంట్పై చర్చించాలని కోరాం: శ్రీకృష్ణదేవరాయలు
AP: విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన సంస్థల గురించి పార్లమెంట్లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ గురించి వెల్లడించాలని కోరాం. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ప్రస్తావించాం’ అని పేర్కొన్నారు.
News November 24, 2024
పెర్త్లో కోహ్లీ కుమారుడు అకాయ్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ ఫొటోలు తొలిసారిగా బయటకు వచ్చాయి. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్కు అనుష్క తనతో పాటు అకాయ్ను పెర్త్ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అకాయ్ అచ్చం కోహ్లీలాగే ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టెస్టులో విరాట్ (100*) సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
News November 24, 2024
IPL వేలం: ఈ అన్క్యాప్డ్ ప్లేయర్లకు భారీ ధర?
కాసేపట్లో IPL మెగా వేలం ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్లు భారీ ధరే పలికే అవకాశం ఉందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వారిలో అంగ్రిశ్ రఘువంశీ, వైభవ్ అరోరా, అశుతోశ్ శర్మ, రసిఖ్ సలామ్ దార్, అభినవ్ మనోహర్ ఉన్నారు. వీరిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఐదుగురిలో మీ ఫేవరెట్ ఎవరు? వారికి ఎంత దక్కే అవకాశం ఉందనుకుంటున్నారు?