News December 5, 2024
సమంత చికిత్సకు రూ.25 లక్షలిచ్చా: నిర్మాత

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో నటించిన సమయంలో హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా స్టార్ హోటల్లో ఉంచాం. 4 నెలలకు కోలుకున్నారు. ఇప్పటికీ ఆ సాయాన్ని ఆమె మరచిపోలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్

ఎనిమిది యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి దక్కలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ఆయన లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి ఆలోచించనని, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నోబెల్ ఇవ్వకపోవడమే తన దృక్పథం మారడానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ లీక్ కావడంతో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
News January 19, 2026
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.


