News January 14, 2025
గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5వేలను ₹25వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.
Similar News
News September 8, 2025
BREAKING: ఈనెల 21 నుంచి దసరా సెలవులు

తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలిడేస్ అక్టోబర్ 3 వరకు కొనసాగుతాయని అందులో పేర్కొంది. ఈ మేరకు స్కూళ్లకు విద్యాశాఖ రిమైండర్ పంపింది. అటు జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
News September 8, 2025
లిక్కర్ కేసు నిందితులకు నోటీసులు!

AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
News September 8, 2025
చరిత్ర సృష్టించిన తెలంగాణ ఆర్చర్ చికిత

ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.