News October 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 15, 2025

వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం

image

TG: వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. టిమ్స్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాల వ్యయంపై ఆరా తీశారు. మరోవైపు సీఎం ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు.

News October 15, 2025

విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

image

AP: విజయవాడలో విద్యుత్ సంఘాల నేతలతో CS విజయానంద్, విద్యుత్ CMDల చర్చలు ముగిశాయి. సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కొచ్చాయని JAC నేత కృష్ణయ్య పేర్కొన్నారు. ‘కొన్ని అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఈ నెల 17న మ.3 గం.కు మళ్లీ చర్చలకు హాజరవుతాం. అప్పుడు సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.

News October 15, 2025

బ్రహ్మకు ఒక పగలు.. మనకు ఎంతంటే?

image

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కలియుగం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం దీనికి రెండింతలు. అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మూడింతలు. అంటే 12,96,000 సంవత్సరాలు. ఇక ధర్మప్రధానమైన కృతయుగం నాలుగు రెట్లు. అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఓ మహాయుగం. ఇలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవునికి ఓ పగలు అవుతుంది. మరో వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>