News December 25, 2024

మహిళల కోసమే రూ.3.27లక్షల కోట్లు

image

భారత్‌లో జెండర్ బడ్జెటింగ్ పాలసీ అమలుకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2014లో కేటాయింపులను 4.5 నుంచి 6.8 శాతానికి పెంచిన మోదీ ప్రభుత్వం FY25లో ఏకంగా 18.9%కి చేర్చిందని RBI నివేదిక పేర్కొంది. దీని విలువ రూ.3.27L కోట్లని వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌ను 3 పార్టులుగా విభజిస్తారు. పార్ట్ Aలో పూర్తిగా PMAY, LPG కనెక్షన్ వంటి మహిళల స్కీములే ఉంటాయి. పార్ట్ B, Cలో కనీసం 30% నిధులు వారి సంక్షేమం కోసం మళ్లిస్తారు.

Similar News

News December 26, 2024

2030 నాటికి 20K మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి: భట్టి

image

TG: హరిత ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించినట్లు Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. దీనిపై జనవరి 3న HICCలో వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వల్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 2034-35 నాటికి 31,809 మెగా వాట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

News December 26, 2024

డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సంభవించిన సునామీ పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు.

News December 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.