News October 13, 2025
హగ్‌కు రూ.3.73 లక్షల ఫీజు.. యువతిపై ట్రోల్స్

చైనాలో ఓ యువతి చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. చైనీస్ పద్ధతి ప్రకారం యువతికి యువకుడి ఫ్యామిలీ గిఫ్ట్‌గా ₹25 లక్షలిచ్చింది. ఇంతలో ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసి మనీ తిరిగివ్వడానికి ఒప్పుకుంది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో తనను హగ్ చేసుకున్నందుకు ₹3.73 లక్షల ఫీజు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. SMలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
కొల్లేటి వ్యవసాయం గొడ్డు వినాశనం

కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం పల్లపు ప్రదేశం కావడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు పూర్తిగా మునిగిపోతాయి. దీని వల్ల రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాదు. అలాగే భూముల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల గడ్డి కుళ్లిపోయి, పశువులకు మేత కూడా లభించదు. ఫలితంగా మేత లేక, రోగాల బారిన పడి పశువులు చనిపోతాయి. అందుకే కొల్లేటి వ్యవసాయం అటు పంటను, ఇటు పశుసంపదను కూడా ముంచేస్తుందని ఈ సామెత భావం.
News February 18, 2026
దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.
News February 18, 2026
రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే..

రోజుకు 10 నిమిషాలైనా ఎండలో ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుంది. ఇది ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. మూడ్‌ని మార్చేసి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. చర్మంలోని నైట్రిక్ ఆక్సైడ్ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అని చెబుతున్నారు.


