News November 7, 2024
వాస్తు పిచ్చితో రూ.3కోట్లు వృథా: హరీశ్ రావు

AP: సచివాలయంలో <<14547237>>మార్పులపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తు పిచ్చితో రేవంత్ రెడ్డి పూటకో మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గేటు మార్పు కోసం రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్తో సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. కాగా సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ప్రధాన ద్వారంను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News November 16, 2025
వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
News November 16, 2025
శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.
News November 16, 2025
‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.


