News November 7, 2024

మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ

image

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.

Similar News

News November 7, 2024

సందీప్ కిషన్‌తో పూరీ జగన్నాథ్ సినిమా?

image

లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ల తర్వాత పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఇందులో హీరో సందీప్ కిషన్‌ నటిస్తారని తెలుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇతనికి కూడా సరైన విజయం దక్కలేదు. దీంతో సందీప్ మేనమామ శ్యామ్ కె.నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. స్నేహితుడు పూరీతో కలిసి మూవీని పట్టాలెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

News November 7, 2024

2027లో ఫలితం అనుభవిస్తారు: విజయసాయిరెడ్డి

image

AP: YCP కార్యకర్తలను అరెస్ట్ చేసే కొందరు కుల పిచ్చి అధికారులు, TDP నేతలు 2027లో ఫలితం అనుభవించాల్సి ఉంటుందని MP విజయసాయిరెడ్డి అన్నారు. ఇందుకు తయారుగా ఉండాలని ఆయన చెప్పారు. ‘పైశాచిక పోస్టులు పెడుతున్న TDP సైకోలకు చెక్ పెట్టరా? ఖాకీలు, YCP సోషల్ మీడియా కార్యకర్తలను నెల రోజుల్లో సెట్ చేస్తాననడం అధికార అహంకారమే. కడప SPపై వేటుతో TDP తన కుల విధానంపై క్లారిటీ ఇచ్చేసిందా?’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

News November 7, 2024

శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ

image

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన మూడో డబుల్ హండ్రెడ్‌ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.