News June 20, 2024
అభిమాని మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు: దర్శన్

కర్ణాటకలో సంచలనంగా మారిన అభిమాని రేణుకాస్వామి <<13457717>>హత్య<<>> అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు మరో నిందితుడికి దర్శన్ రూ.30 లక్షలు అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. స్వయంగా నటుడు దర్శన్ ఈ విషయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ హత్య కేసులో దర్శన్‌తో సహా 17 మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
Similar News
News March 27, 2026
IPL 2026 ఓపెనింగ్ సెరిమనీ రద్దు!

ఈ ఏడాది IPL ఓపెనింగ్ సెరిమనీ ఉండదు. గతేడాది జూన్ 4న బెంగళూరు స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈసారి వేడుకలు నిర్వహించొద్దని BCCI నిర్ణయించింది. అందుకే శనివారం జరిగే ఫస్ట్ మ్యాచ్ ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయట్లేదు. అయితే మే 31న జరిగే ఫైనల్ రోజు మాత్రం గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ ప్లాన్ చేస్తున్నారు.
News March 27, 2026
రీజినల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ DPR రెడీ!

TG: RRR సౌత్ పార్ట్ పనుల్లో కేంద్రం స్పీడ్ పెంచింది. DPR కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటికే DPR తయారీకి కన్సల్టెన్సీని అపాయింట్ చేసినట్లు తెలిపారు. నార్త్ పార్ట్ పనులు టెండర్ స్టేజ్‌లో ఉండగా ఇప్పుడు సౌత్ పార్ట్ విషయంలోనూ ముందడుగు పడటం విశేషం.