News July 20, 2024

బీజేపీ హయాంలో రూ.300 కోట్ల స్కామ్: డీకే శివకుమార్

image

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం హయాంలో రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ‘ఫాదర్స్ ఆఫ్ కరప్షన్’ అని కామెంట్స్ చేశారు. యడియూరప్ప, బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో ఈ కుంభకోణాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపిస్తామని మీడియాతో చెప్పారు. స్కామ్ వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

News January 25, 2025

జగన్ CM కావడానికి VSR పనిచేశారు: కాకాణి

image

AP: జగన్ CM కావడానికి <<15247358>>విజయసాయిరెడ్డి<<>> పని చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ‘పార్టీ కోసం పాటుపడ్డారు. కుట్రలు, దుష్ప్రచారం చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది’ అని కాకాణి చెప్పారు. మరోవైపు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలను ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి ఖండించారు. దావోస్ పర్యటన నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతానన్నారు.

News January 25, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 25, శనివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు ✒ ఇష: రాత్రి 7.23 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.