News April 11, 2025
ఓర్వకల్లు, కొప్పర్తి కారిడార్లలో రూ.3035 కోట్ల పనులు

AP: హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌కు రూ.1771.19 కోట్లు, వైజాగ్-చెన్నై కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌కు రూ.1264.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిజైన్ మొదలు నిర్వహణ వరకూ ఈ నిధుల్ని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సర్కారు తాజాగా జారీ చేసింది.
Similar News
News December 3, 2025
పార్వతీపురం: సీఎం గారూ.. ఆశలన్నీ మీపైనే!

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై కదలిక వస్తుందా? అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో వేధిస్తున్న ఏనుగుల సమస్య, వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు, విద్యా, వైద్య సిబ్బంది నియామకాలు, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం హామీలు, నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారేమోనని ప్రజలు వేచి చూస్తున్నారు.
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 3, 2025
T20 వరల్డ్ కప్‌కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్‌పూర్‌లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్‌కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.


