News October 23, 2024
దసరాకి రూ.307.16 కోట్ల ఆదాయం: TGSRTC

TG: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సాధారణ బస్సులతో పాటు 10,513 అదనపు బస్సులను నడిపినట్లు TGSRTC అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకూ మొత్తం 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Similar News
News March 17, 2025
గ్రామ, వార్డు వాలంటీర్లపై కీలక ప్రకటన

AP: గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పని చేయట్లేదని స్పష్టం చేశారు. వారిని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పదవి పొడిగింపునకు జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెగ్యులరైజ్ చేసేవాళ్లమని వివరించారు.
News March 17, 2025
పోలవరం ఎత్తును తగ్గించింది జగనే: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టు కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇందులో కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించిందన్నారు. తొలి దశ R&Rను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారని, 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది ఆయనేనని విమర్శించారు. పోలవరం ఎత్తును ఎందుకు తగ్గించారో జగన్నే అడగాలన్నారు.
News March 17, 2025
పాక్‌కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా

తమ మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరో జలాంతర్గామిని అందించింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను ఇస్లామాబాద్‌కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండూ కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్‌ను అడ్డుకునేందుకు పాక్‌ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తోంది.