News April 2, 2025

ఎకరానికి రూ.31,000: మంత్రి ప్రకటన

image

AP: రిలయన్స్ <<15966046>>CBG ప్లాంట్లతో<<>> ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. గుజరాత్ కంటే ఏపీలోనే రిలయన్స్ ఎక్కువగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా బంజరు భూములు వినియోగంలోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూములకు రూ.31వేలు కౌలు చెల్లిస్తామన్నారు. కందుకూరులో ఇండోసోల్ ప్లాంట్, BPCL అందుబాటులోకి రానున్నాయన్నారు.

Similar News

News September 11, 2025

నిజమైన ‘శ్రీమంతుడు’!

image

మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ మంచి మనసు చాటుకున్నారు. పంజాబ్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతారా ఫౌండేషన్ ద్వారా 10వేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్‌లు అందించారు. ఒంటరి మహిళలు & వృద్ధులు ఉంటే రూ.5వేలు పంపిణీ చేశారు. అలాగే పశువులకు వైద్యం అందించి మెడిసిన్స్, ఫుడ్స్ ఇస్తున్న అనంత్‌ నిజమైన శ్రీమంతుడు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News September 11, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్

image

AP: ఈనెల 20లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు పేర్కొంది. రిలీజ్ చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంది. అటు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలు <<17653923>>బంద్<<>> చేస్తామని ఇటీవల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరించాయి.

News September 11, 2025

నేపాల్ నిరసనలకు ముఖ్య కారణం ఇతడేనా?

image

నేపాల్ ఆందోళనలకు Hami Nepal అనే NGO ప్రెసిడెంట్ సుడాన్ గురుంగ్ ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 2015లో భూకంపం తర్వాత ఈ NGOను స్థాపించారు. దీనికి అమెరికా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించే ఒకరోజు ముందు (SEP 8న) ఎలా నిరసన చేయాలో చెబుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దీంతో నేపాల్ ప్రభుత్వ మార్పు వెనుక US ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.