News January 2, 2025

రూ.331.84 కోట్ల మద్యం తాగేశారు!

image

AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.331.84కోట్ల బిజినెస్ జరిగింది. 30న రూ.219.43కోట్లు, 31న 112.41 కోట్ల మద్యం అమ్ముడైంది. 4లక్షలకు పైగా లిక్కర్, లక్ష 61వేలకు పైగా బీరు కేసులు విక్రయించారు. రాష్ట్రంలో డైలీ రూ.80కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. సాధారణం కంటే మద్యం దుకాణాలు, బార్లకు 2గంటలు అదనపు సమయం కేటాయించడంతో అమ్మకాలు పెరిగాయి.

Similar News

News February 5, 2025

కారు యజమానులకు GOOD NEWS!

image

నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.

News February 5, 2025

ఈ నెల 10న కొడంగల్‌లో BRS రైతు దీక్ష

image

TG: సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.

News February 5, 2025

రూ.1,126కోట్ల రైతుభరోసా నిధులు జమ: కాంగ్రెస్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26న ప్రారంభించిన రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు రూ.1,126కోట్లు జమ అయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ఇవాళ ఒక్క రోజే 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని, మొత్తం ఇప్పటి వరకు 21.45 లక్షల మందికి నిధులు అందాయని స్పష్టం చేసింది. ఎకరాకు రైతు బంధు రూ.5వేలే వచ్చేవని, రైతు భరోసా కింద రూ.6వేలు అందుకుంటున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.

error: Content is protected !!