News March 16, 2024

11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్: ఈసీ

image

2022-23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ₹3,400 కోట్ల అక్రమ డబ్బును సీజ్ చేసినట్లు EC వెల్లడించింది. 2017-18తో పోలిస్తే 835% పెరిగినట్లు పేర్కొంది. గుజరాత్‌- ₹802 కోట్లు, తెలంగాణ-₹778 కోట్లు, రాజస్థాన్‌-₹704 కోట్లు, కర్ణాటక-₹384 కోట్లు, మధ్యప్రదేశ్‌-₹332 కోట్లు, మిజోరాం-₹123 కోట్లు, ఛత్తీస్‌గఢ్-₹78 కోట్లు, మేఘాలయ-₹74 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-₹57 కోట్లు, నాగాలాండ్-₹50 కోట్లు, త్రిపుర-₹45 కోట్లు.

Similar News

News September 5, 2025

DJ సౌండ్‌తో ప్రాణాలు పోతాయా?

image

డీజేల వద్ద డాన్సులు చేస్తూ <<17598618>>చనిపోతున్న<<>> వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే డీజే శబ్దాలతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని జర్మనీలోని ఓ వర్సిటీ అధ్యయనంలో తేలింది. బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయే అవకాశమూ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్లకు అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉందని, గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News September 5, 2025

తెలంగాణ అప్‌డేట్స్

image

* ఇవాళ 5 వేల మంది గ్రామ పాలనాధికారుల (GPO)కు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
* ఉ.10 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడిని కుటుంబసభ్యులతో దర్శించుకోనున్న CM రేవంత్
* అర్బన్ ఏరియాల్లో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పనులు.. 50 వేల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ
* ఈ నెల 8న క్యాన్సర్ డే-కేర్ సెంటర్లు ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ

News September 5, 2025

హార్దిక్ పాండ్యా న్యూ లుక్

image

టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ప్లాటినం బ్లాండ్ హెయిర్ స్టైల్‌తో కనిపించారు. ఈ న్యూ లుక్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆసియా కప్‌ కోసం హార్దిక్ రెడీ అయ్యారని, అతడి ట్రాన్స్‌ఫమేషన్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. SEP 9న మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటికే పాండ్యా దుబాయ్ చేరుకున్నారు. హార్దిక్ న్యూ లుక్ ఎలా ఉంది? కామెంట్.