News September 11, 2025
4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
Similar News
News January 31, 2026
జిల్లాలో ఉద్యాన సాగు విస్తరణకు ప్రణాళిక: VZM కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి కంటే ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయన్నారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి, సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
News January 31, 2026
TODAY HEADLINES

* AP: HYDకి మించిన నగరంగా అమరావతి: CBN
* AP: 3న క్యాబినెట్ భేటీ.. 11 నుంచి బడ్జెట్ సమావేశాలు
* AP: గ్రూప్-1 ఫలితాలు విడుదల
* AP: కల్తీ నెయ్యితో 20Cr లడ్డూలు తయారీ: TTD ఛైర్మన్
* TG: మేడారం జాతర.. మొక్కులు తీర్చుకున్న లక్షల మంది
* TG: నందినగర్‌లోనే కేసీఆర్ విచారణ: సిట్
* TG: ముగిసిన ‘మున్సిపల్’ నామినేషన్లు.. 11న పోలింగ్
* TG EAPCET షెడ్యూల్ రిలీజ్
* వచ్చే ఏడాది APR 7న ‘వారణాసి’ రిలీజ్
News January 31, 2026
బెదిరింపులు ఆపితే అమెరికాతో చర్చలకు సిద్ధమే: ఇరాన్

ట్రంప్ ప్రభుత్వం తన బెదిరింపులను ఆపితే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ప్రకటించారు. ఇరాన్ యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉందో, చర్చలకూ అంతే సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే తమ మిస్సైల్ కార్యక్రమంపై మాత్రం రాజీ పడబోమని తేల్చి చెప్పారు. అమెరికా సైనిక చర్యలకు దిగితే అది ఇరు పక్షాల మధ్య యుద్ధంగా మిగిలిపోదని, మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు.


